వైఎస్సార్ జిల్లా: పులివెందులలో రెండు రోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ శ్రేణుల మూకదాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను బుధవారం సాయంత్రం ఫోన్ ద్వారా పరామర్శించిన జగన్, వారికి ధైర్యం చెప్పారు.
పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నాయకుడు వేల్పుల రాము పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. వీరితో పాటు గాయపడిన సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి లతోనూ జగన్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని గ్రహించిన కూటమి నేతలు ఇప్పుడు భయం కలిగించే చర్యలు సృష్టించేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్య. ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు, అని జగన్ వ్యాఖ్యానించారు.ఇటీవల జరిగిన ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి తో సహా పలువురు పార్టీ నేతలు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. పార్టీకి ఏమాత్రం అపాయం కలిగినా అందరికీ అండగా నిలబడతామని, ధైర్యంగా ఉండాలని జగన్ కార్యకర్తలకు సూచించారు.పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ మళ్లీ వాడివేడి రాజకీయం తెరపైకి వచ్చింది. రాజకీయ శత్రుత్వం పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
0 Comments